Posts

Sun and Sai Bhaskar compare poem (in Telugu)

  సూర్యోదయాన నిద్ర లేచేది భాస్కరుడు భాస్కరుని ఇంటి ముందు ఉదయించేది సూర్యుడు ఇద్దరు ఒక్కటే  సూర్యుడు పైన నుంచి వాతావరణంలో వేడి పుట్టిస్తాడు భాస్కరుడు క్రింద నుంచి వాతావరణం పై వేడి పుట్టిస్తాడు ఇద్దరు ఒక్కటే సూర్యుడు ప్రకాశిస్తే చీకట్లు తోలుగుతాయి భాస్కరుడు కదిలితే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది ఇద్దరు ఒక్కటే సూర్యుడు ఉదయిస్తే రోజు అవుతుంది భాస్కరుడు మాట్లాడితే పుస్తకాలు అవుతాయి ఇద్దరు ఒక్కటే సూర్యుడు రథం అధిరోహిస్తే భాస్కరుడు పథం ఏర్పరుస్తాడు ఇద్దరు ఒక్కటే సూర్యుడు తేజస్సు మనకు మనుగడ భాస్కరుడు మేధస్సు మనకు దిక్సూచి  ఇద్దరు ఒక్కటే  సూర్యుడి వలన భూతాపం రాదు భాస్కరుడు బాధ భూతాపం వద్దని  ఇద్దరు ఒక్కటే సూర్యుడు భూమికి కేంద్రం భాస్కరుడు భూకేంద్రానికి అధిపతి ఇద్దరు ఒక్కటే ---------పుట్టిన రోజు సందర్భంగా శ్రీ. నక్కా సాయి భాస్కర్ రెడ్డి కి అంకితం